![]() |
![]() |

నీకు దోశలలో ఎన్ని రకాలు తెలుసు? మసాలా దోశ.. ఆనియన్ దోశ .. రవ్వ దోశ.. ఉప్మా దోశ ఇంకా అంతే తెలుసు. అంతేనా ఊపిరి దోశ ఎలా ఉంటుందో తెలుసా.. ఊపిరి దోశ అంటే ఏంటో? ఎలా ఉంటుందో తన ఇన్ స్టాగ్రామ్ లో చేసి చూపిస్తున్నాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్.
బిగ్ బాస్ -4 లో అఖిల్ రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్న ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్ సార్థక్, మోనల్ గజ్జర్ తో జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయిన కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రతీ ఎపిసోడ్ ని ఫాలో అవుతూ కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ ప్రశాంత్ కి అన్యాయం జరుగుతుందని పోస్ట్ లు చేశాడు. సెలబ్రిటీలంతా ఒకవైపు ఉండి ఒక కామన్ మ్యాన్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటు చెప్పిన అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ ని కలిసాడు.

ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అఖిల్ సార్థక్ తాజాగా ఓ పోస్ట్ చేశాడు. తన ఇంట్లో దోశలు చేస్తూ రెండు వీడియోలని పోస్ట్ చేసాడు. అఖిల్ దోశ చేస్తుండగా అది మధ్యలో రెండుచోట్ల విరిగిపోయింది. ఇక తన ఫ్రెండ్ ఎందుకు ఇలా అయిందని అడుగగా.. దోశకి ఊపిరి అందాలని ఆ రెండు చోట్ల బొక్కలు పెట్టానని చెప్పాడు. ఇక మొదటి దోశ ముక్కలు ముక్కలవ్వగా.. ఇది దేవుడికి అని అఖిల్ అన్నాడు. ఆ తర్వాత సెకెండ్ దోశ కోసం కష్టపడి రౌండ్ గా వచ్చేలా ఏకాగ్రతతో చేశాడు. ఈ ప్రాసెస్ ని అంతా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు అఖిల్. కాగా ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
![]() |
![]() |